అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hero Ram | తెలుగు ప్రేక్షకులను ‘మిస్టర్ బచ్చన్’ తో అలరించిన నూతన కథానాయిక భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Bhorse) ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. అయితే ఆమె పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో (Social Media) ఇంకో కారణంగా మారుమోగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో (hero Ram Pothineni) ఆమె డేటింగ్ లో ఉందని జోరుగా ప్రచారం నడుస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే, వీరి మధ్య ఉన్న అనుబంధంపై రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇటీవల రామ్, భాగ్యశ్రీ ఇద్దరూ షేర్ చేసిన ఫొటోలలో బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటంతో ప్రచారం ఊపందుకుంది.
Hero Ram | ఇద్దరు ఒకే చోట..
ఈ క్రమంలో నెటిజన్లు, ఇద్దరూ ఒకే గదిలో ఫోటోలు దిగారా, మీ చేతికి ఉన్న ఉంగరాన్ని ఎవరు తొడిగారు? అంటూ కామెంట్లు చేశారు. ఈ రూమర్లపై భాగ్యశ్రీ స్పందిస్తూ.. “ఆ ఉంగరం నేను కొనుకున్నది” అంటూ క్లారిటీ ఇచ్చినప్పటికీ, చర్చ మాత్రం ఆగడం లేదు. అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు ఆమె సమాధానాన్ని కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. తాజాగా మరో సాక్ష్యాన్ని చూపించి ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. హీరో రామ్ (Hero Ram) పెట్టుకున్న గాగుల్స్ భాగ్య శ్రీ టేబుల్‌పైన కనిపించడంతో ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉన్నారని, వారిద్దరు ఫారెన్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈ జంట శుభవార్త చెప్పడం ఖాయం అంటున్నారు. మరి కొందరు మాత్రం అలాంటిదేమి లేదని అంటున్నారు.
ఇక రామ్, భాగ్య శ్రీ కలిసి నటిస్తున్న తాజా చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ మహాలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతేకాదు, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో చేస్తున్న ‘కాంత’ (Kanta) అనే మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది.ఇటీవల భాగ శ్రీ పేరు తెలుగులో గట్టిగానే వినిపిస్తుంది. మంచి హిట్ పడితే ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం.