ePaper
More
    Homeజిల్లాలుమెదక్​Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    Published on

    అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్​ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులకు వరద పోటెత్తడంతో అలుగు పారుతున్నాయి.

    మెదక్​ (Medak) జిల్లా రామాయంపేటలో 316.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. నర్సింగి శివనూరులో 289.4, హవేలి ఘన్​పూర్​లో 287, లక్ష్మాపూర్​లో 253.3మి. మీ. వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు గ్రామాలకు వెళ్లే రాహదారులు కొట్టుకుపోయాయి.

    Heavy Rains | నిలిచిన రాకపోకలు

    మెదక్​ – ఎల్లారెడ్డి మార్గంలో నక్కవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి కొట్టుకుపోయింది. హవేలి ఘన్​పూర్​ (Haveli Ghanpur) మండలం ధూప్‌సింగ్‌ తండాని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో గంగమ్మ వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ప్రజలు ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తిమ్మాయిపల్లి, నాగపూర్‌, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. పిల్లికొట్టాల్‌లో సబ్‌ స్టేషన్‌ నీట మునగడంతో జిల్లా కేంద్రంలో కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. హవేలి ఘన్​పూర్​ మండలంలోని పలు గ్రామాలకు అర్ధరాత్రి నుంచి కరెంట్​ సరఫరా నిలిచిపోయింది.

    Heavy Rains | ప్రమాదకరంగా చెరువు

    హవేలి ఘన్​పూర్​ మండలం బూర్గుపల్లి (Burgupalli) చెరువుకు భారీగా వరద వస్తోంది. ప్రమాదకర స్థితిలో చెరువు అలుగు పారుతోంది. చెరువు కట్టను వరద నీరు తాకడంతో పాటు అలుగు పారిన నీరు రోడ్డు మీదుగా పారుతోంది. దీంతో ఆ మార్గంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు తెగిపోయే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వాడి–రాజిపేట గ్రామాల మధ్య గల గంగమ్మ వాగు ఉధృతంగా పారుతోంది.

    Latest articles

    CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ క​లెక్టర్లూ.. అలర్ట్​గా ఉండండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలు

    అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని...

    Heavy Rains | వరదల్లో చిక్కుకున్న పలువురు.. కాపాడిన పోలీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Heavy Rains | జుక్కల్​ నియోజవర్గాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి....

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway...

    Heavy Rains | వర్షాలకు ఒకరి మృతి.. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడిన సిబ్బంది

    అక్షరటుడే, నెట్​వర్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో వర్షాలతో ఒకరు మృతి చెందారు. రాజంపేట మండల...

    More like this