Ahmedabad Weather
Ahmedabad Weather | అహ్మ‌దాబాద్‌లో కుండ‌పోత వర్షం.. ఒక్క‌సారి ఆగితే అంతా 30 నిమిషాల్లోనే రెడీ..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Weather | పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Punjab Kings and Royal Challengers Bangalore) మధ్య ఈ రోజు IPL 2025 ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు (Cricket lovers) ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లు కూడా తొలి ఐపీఎల్ ట్రోఫీ (IPL trophy) తీసుకెళ్లడానికి ఆసక్తితో వ్యూహాలు సిద్ధం చేశాయి. కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఈరోజు ఫైనల్ ఫలితం తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉన్నారు. అయితే పంజాబ్ , బెంగళూరు (Punjab and Bangalore) మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కానీ ఈరోజు IPL 2025 ఫైనల్ మ్యాచ్ జరగకపోతే ఎలా అని అంద‌రిలో టెన్ష‌న్ ఉంది.

Ahmedabad Weather | ఎలా మేనేజ్ చేయాలి..

అహ్మదాబాద్ వాతావరణ శాఖ (Meteorological Department) వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైనల్ మ్యాచ్ జరిగే మంగళవారం నాడు ఆకాశం రోజంతా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. “అహ్మదాబాద్ నగరం (Ahmedabad city) మరియు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో వ‌ర్షం ప‌డి త‌గ్గింది. దాంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎంత వ‌ర్షం ప‌డిన కూడా బీసీసీఐ (BCCI) చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో కేవలం 30 నిమిషాల్లోనే పిచ్‌ను సిద్ధం చేయనున్నారు. స్టేడియంలో సబ్-సాయిల్ డ్రైనేజీ వ్యవస్థ (sub-soil drainage system) ఉంది, ఇది 30 నిమిషాల్లో భారీ వర్షపు నీటిని బయటకు పంపగలదు.

ఇందులో భాగంగా మైదానం కింద వంపుతిరిగిన సబ్-సాయిల్ పైపులు వేశారు. ఇది వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తుంది. పైపుల ద్వారా నీరు స్టేడియం నుంచి బయటకు పంపిస్తారు. 58 రకాల డ్రెయిన్ వైవిధ్యాలు ఉన్నాయి. అవన్నీ 19 ప్రధాన పైపులకు (లీడ్‌లు) అనుసంధానించబడి ఉంటాయి. ఇవి వర్షపు నీటిని త్వరగా బయటకు పంపడంలో సహాయపడతాయి. కాగా, ఈ మ్యాచ్‌కు బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునక్ (former British Prime Minister Rishi Sunak) హాజరుకానున్నారు. అలాగే, వెటరన్ క్రికెటర్ క్రిస్ గేల్ (cricketer Chris Gayle) కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు. మ్యాచ్ కోసం 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 4 వేలకు పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.