అక్షరటుడే, హైదరాబాద్: Railway Budget | పార్లమెంటులో ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Union Finance Minister Nirmala Sitharaman ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో రైల్వేశాఖకు భారీగా నిధులు కేటాయించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. గతేడాది (2025– 26)తో పోల్చితే.. తాజాగా ఈ రంగానికి భారీగా నిధులు కేటాయించడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపర్చేలా ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్ల High-Speed Train Corridors ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ కారిడార్ల వల్ల ఐటీ హబ్‌లు, ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయం సగాని కంటే ఎక్కవ తగ్గనుంది.
భారత రైల్వే రంగానికి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ₹ 293,030 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.278,030 కోట్లు కేటాయించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలకు.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారనే చెప్పాలి. ఏడు హై-స్పీడ్ కారిడార్లలో మూడు గ్రేటర్ హైదరాబాద్‌ను అనుసంధానించడం శుభపరిణామంగా పేర్కొంటున్నారు.
Railway Budget | కారిడార్లు ఇవే..
- పుణె – హైదరాబాద్
- హైదరాబాద్ – బెంగళూరు
- హైదరాబాద్ – చెన్నై
- ముంబై – పుణె
- ఢిల్లీ – వారణాసి
- వారణాసి – సిలిగురి
- చెన్నై – బెంగళూరు
Railway Budget | ‘కవచ్ 4.0’
ప్రస్తుత ‘కవచ్’ వ్యవస్థను ‘కవచ్ 4.0’ కి అప్‌గ్రేడ్ చేయబోతున్నారు. రైలు ప్రమాదాల నివారణకు కీలకమైన స్వదేశీ సాంకేతికత ‘కవచ్’ను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో భారీగానే నిధులు కేటాయించారు. కేవలం భద్రతా పరమైన చర్యల కోసమే ₹ 28,000 కోట్లు కేటాయించడం గమనార్హం.