ePaper
More
    HomeతెలంగాణCaste Census | కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్​ గాంధీ విజయం: సీఎం రేవంత్

    Caste Census | కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్​ గాంధీ విజయం: సీఎం రేవంత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ rahul gandhi విజయమని సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy అన్నారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

    జనగణనతో పాటు కులగణన caste census చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కులగణన జరగాలని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా డిమాండ్‌ చేశారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాహుల్​ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టామని ఆయన తెలిపారు.

    తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టామన్నారు. 95 వేల ఎన్యుమరేటర్లతో సర్వే survey నిర్వహించామని వివరించారు. సర్వే పర్యవేక్షణకు సూపర్​వైజర్లు, ప్రత్యేకాధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. కుల గణన చేపట్టి అసెంబ్లీ assemblyలో బిల్లు bill పాస్ చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కుల గణన బిల్లు ఆమోదించాలని ఢిల్లీ delhi జంతర్​ మంతర్​ వద్ద ధర్నా కూడా చేశామన్నారు.

    దేశవ్యాప్తంగా కులగణన caste census కోసం కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. అనంతరం నిపుణుల కమిటీతో ప్రజ​ల అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఆ తర్వాతే కులగణన చేపట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో సర్వే చేయాలని సూచించారు. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కేంద్రం కులగణన ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలపాలని డిమాండ్​ చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...