Caste Census | కులగణనపై కేంద్రం నిర్ణయం రాహుల్​ గాంధీ విజయం: సీఎం రేవంత్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ rahul gandhi విజయమని సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy అన్నారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జనగణనతో పాటు కులగణన caste census చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కులగణన జరగాలని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా డిమాండ్‌ చేశారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాహుల్​ గాంధీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Caste Census | దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ rahul gandhi విజయమని సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy అన్నారు. గురువారం ఆయన జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

జనగణనతో పాటు కులగణన caste census చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కులగణన జరగాలని రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా డిమాండ్‌ చేశారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాహుల్​ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టామని ఆయన తెలిపారు.

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టామన్నారు. 95 వేల ఎన్యుమరేటర్లతో సర్వే survey నిర్వహించామని వివరించారు. సర్వే పర్యవేక్షణకు సూపర్​వైజర్లు, ప్రత్యేకాధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. కుల గణన చేపట్టి అసెంబ్లీ assemblyలో బిల్లు bill పాస్ చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. కుల గణన బిల్లు ఆమోదించాలని ఢిల్లీ delhi జంతర్​ మంతర్​ వద్ద ధర్నా కూడా చేశామన్నారు.

దేశవ్యాప్తంగా కులగణన caste census కోసం కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. అనంతరం నిపుణుల కమిటీతో ప్రజ​ల అభిప్రాయాలు సేకరించాలన్నారు. ఆ తర్వాతే కులగణన చేపట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో సర్వే చేయాలని సూచించారు. కేంద్రం తీసుకున్న కుల గణన నిర్ణయంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కేంద్రం కులగణన ఎప్పుడు మొదలు పెట్టి, ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలపాలని డిమాండ్​ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...