అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab Wedding Cash Shower | పెళ్లి అంటే జీవితంలో మర్చిపోలేని వేడుక. ఈ వేడుకను ఘనంగా జరుపుకోడానికి జంటలు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ వరుడు తన కాబోయే భార్యపై నోట్ల వర్షం కురిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది.
పంజాబ్లో జరిగిన ఒక వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టార్న్ తరణ్ ప్రాంతంలో ఫిబ్రవరి 14న జరిగిన వివాహ వేడుకలో వధువుపై వరుడి కుటుంబ సభ్యులు భారీగా డబ్బులు వెదజల్లారు. పెళ్లి కూతురు వేదిక మధ్యలో నిలబడి ఉండగా.. వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు ఆమెపై నోట్ల వర్షం కురిపించారు. పంజాబీ వివాహాల (Punjabi Weddings)లో ఇది ఒక ఆచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేగాకుండా రూ.8.5 కోట్లు వధువుపై చల్లారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని వరుడి కుటుంబ సభ్యులు ఖండించారు.
Punjab Wedding Cash Shower | నెటిజన్ల స్పందన
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఈ కార్యక్రమాన్ని చాలామంది “గ్రాండ్ క్యాష్ పార్టీ”గా మార్చారని పేర్కొంటున్నారు. వేడుక సమయంలో డబ్బు వర్షం కురిపించినప్పటికీ, ఆ మొత్తం చాలా తక్కువ అని వరుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వరుడి సోదరుడు సికందర్ సింగ్ మాట్లాడుతూ.. తన సోదరుడు ఆస్ట్రేలియా (Australia)లో ట్రక్ వ్యాపారం చేస్తాడని తెలిపారు. వివాహం ఫిబ్రవరి 14న జరిగిందని, తాము డబ్బు వర్షం కురిపించినా.. ఆ మొత్తం రూ.2 లక్షల వరకు ఉంటుందన్నారు. దానిని కోట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. వేడుకలో డీజే నిర్వాహకుడు సైతం రూ.8.5 కోట్లు వెదజల్లారనే వాదనను ఖండించారు. ఆ మొత్తం రూ.4 లక్షల వరకు ఉంటుందన్నారు.