ePaper
More
    Homeటెక్నాలజీProjects Astra | గూగుల్ స‌రికొత్త ఫీచర్… ప్రాజెక్ట్స్ అస్త్ర ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది అంటే..!

    Projects Astra | గూగుల్ స‌రికొత్త ఫీచర్… ప్రాజెక్ట్స్ అస్త్ర ఎలా ఉప‌యోగ‌ప‌డుతుంది అంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Projects Astra | గూగుల్(Google) రోజు రోజుకి స‌రికొత్త ఫీచ‌ర్స్ అందుబాటులోకి తెస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ముఖ్యంగా యూజర్లకు ప‌లు టెక్నాలజీల‌ని మరింత ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉంది.

    గూగుల్ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్(Android Operating System)​ను ఏఐ ఫీచర్లతో మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. ఏఐ(AI)ను అనుసంధానిస్తూ గూగుల్‌ సెర్చ్​ను మరింత ఈజీగా మార్చింది. వీడియోల క్రియేషన్‌ కోసం కొత్త టూల్స్​ను తీసుకువచ్చింది. ఇక గూగుల్‌ లెన్స్‌ లో ఇప్పటికే ఇమేజ్‌ ఆధారంగా సెర్చ్ చేసే అవ‌కాశం ఉంది. వీడియోలతోనూ సెర్చ్‌ చేసేలా లెన్స్​ను అప్‌గ్రేడ్‌ చేసింది గూగుల్. ప్రాజెక్ట్ అస్త్రా (Project astra) ద్వారా వీడియో తీస్తూ మధ్యలో ఏదైనా ప్రశ్న వేస్తే, అందుకనుగుణంగా సెర్చ్‌ రిజల్ట్స్‌ వస్తుంటాయి.

    Projects Astra | ఫీచ‌ర్ అదిరింది..

    ప్రాజెక్ట్ అస్త్రా అంటే గూగుల్ కంపెనీ(Google Company)కి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్. ఇది ఫ్యూచర్లో AI అసిస్టెంటుగా మారుతుంది. ఈ ప్రాజెక్టు ఇంచుమించుగా OpneAI, GPT4oలాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మీ ఫోన్ లో ఉండే కెమెరాను చూడటం ద్వారా దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వివరిస్తుంది. అప్పుడు గూగుల్ ఆర్మ్స్ సమర్థవంతమైన AI అసిస్టెంటుగా మారబోతోంది. ఇది ఏదైనా కోడ్‌ని కూడా చదవగలదు. వాటి గురించి వివరణాత్మక సమాచారాన్ని కూడా అందించగలదు. మీరు ఏదైనా ప్రాంతాన్ని చూడటం ద్వారా, మీరు ఎక్కడ ఉంటున్నారు, వాటికి సంబంధించిన పేర్లు ఇతర వివరాలు ఎఐ అసిస్టెంట్(AI assistant) మీకు తెలియజేస్తుంది. గూగుల్ ఆర్మ్స్ చివరిగా ఎక్కడ కనిపించిందో కూడా చెప్పగలదు.

    ఇది ఎఐకి సంబంధించి మరింత పురోగతి సాధిస్తుందని చెప్పొచ్చు. ఇవే కాకుండా, మీరు గూగుల్ ఆర్మ్స్‌కి మల్టీ కొశన్స్ అడగొచ్చు. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్​ను ఏఐ ఫీచర్లతో మరింత అధునాతనంగా తీర్చిదిద్దింది. అయితే ఏఐను అనుసంధానిస్తూ గూగుల్‌ సెర్చ్​ను Google Search మరింత ఈజీగా మార్చింది. వీడియోల క్రియేషన్‌ కోసం కొత్త టూల్స్​ను కూడా తీసుకువచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వార్షిక సదస్సులో తమ ప్రొడక్టులకు మరిన్ని అప్​గ్రేడ్‌లను గూగుల్‌ ప్రకటించింది.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...