అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లు(Asian Markets) సానుకూలంగా ఉండడంతో మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా స్పందించాయి. రోజంతా లాభాలతో కదలాడాయి. ఈ క్రమంలో నిఫ్టీ 26 వేల మార్క్‌ను దాటి నిలబడిరది.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 35 పాయింట్లు, నిఫ్టీ(
Nifty) 46 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 84,638 నుంచి 85,105 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,960 నుంచి 26,097 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 368 పాయింట్ల లాభంతో 84,997 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 26,053 వద్ద స్థిరపడ్డాయి.
ఆటో మినహా..
బీఎస్‌ఈలో పవర్ ఇండెక్స్(Power index) 2.72 శాతం, యుటిలిటీ 2.61 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.55 శాతం, మెటల్ ఇండెక్స్ 1.86 శాతం, ఇన్‌ఫ్రా 1.81 శాతం, ఎనర్జీ 1.57 శాతం, సర్వీసెస్ 1.33 శాతం, పీఎస్‌యూ(PSU) 1.30 శాతం, కమోడిటీ 1.16 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.01 శాతం లాభపడ్డాయి. క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.97 శాతం, ఆటో 0.53 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్(Mid cap) ఇండెక్స్ 0.68 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం లాభపడ్డాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,482 కంపెనీలు లాభపడగా 1,668 స్టాక్స్ నష్టపోయాయి. 175 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 179 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 78 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదాని పోర్ట్స్ 2.78 శాతం, ఎన్టీపీసీ 2.61 శాతం, పవర్ గ్రిడ్ 2.58 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.38 శాతం, టాటా స్టీల్ 1.81 శాతం పెరిగాయి.
Top Losers : బీఈఎల్ 1.54 శాతం, ఎటర్నల్ 1.24 శాతం, ఎంఅండ్‌ఎం 1.15 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.10 శాతం, మారుతి 1.04 శాతం నష్టపోయాయి.