ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | లాభాల్లో సూచీలు

    Stock Markets | లాభాల్లో సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) లాభాలలో కొనసాగుతున్నాయి. అన్ని ప్రధాన రంగాలు రాణిస్తుండడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌(Trading) మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 935 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 255 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌(Sensex) 418 పాయింట్ల లాభంతో 80,660 వద్ద, నిఫ్టీ పాయింట్ల 84 లాభంతో 24,420 వద్ద కదలాడుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు రాణిస్తుండడంతో మన మార్కెట్లూ పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC bank), ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ వంటి ఇండెక్స్‌ హెవీవెయిట్‌ స్టాక్స్‌తోపాటు అదానీ పోర్ట్స్‌, టెక్‌ స్టాక్స్‌ రాణిస్తున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌(Oil and Gas) సెక్టార్‌ 1.2 శాతం పెరగ్గా.. ఐటీ ఇండెక్స్‌ 0.90 శాతం, పీఎస్‌యూ సూచీ 0.88 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.87 శాతం, బ్యాంకెక్స్‌(Bankex) 0.75 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు అరశాతం మేర లాభాలతో ఉన్నాయి.

    Stock Markets | Top Gainers..

    బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 21 స్టాక్స్‌ పాజిటివ్‌గా ఉండగా.. 9 మాత్రమే నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్‌(Adani ports) అత్యధికంగా 5.63 శాతం మేర పెరగ్గా.. మారుతి 2.9 శాతం లాభపడింది. ఎటర్నల్‌, ఇండస్‌ ఇండ్‌ రెండు శాతం పెరగ్గా.. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ(SBI), యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి.

    Stock Markets | Top Losers..

    నెస్లే 1.36 శాతం నష్టపోయింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌(Bajaj Finserv), టైటాన్‌, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...