అక్షరటుడే, ఇందూరు: RP Super Speciality Hospital | క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (RP Super Speciality Hospital ) ఎండీ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆర్పీ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడిపల్లిలోని సీఎంసీ మైదానంలో బుధవారం క్రికెట్ పోటీలను (cricket tournament) ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు.
RP Super Speciality Hospital | యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా..
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. డిచ్పల్లి మండలంలోని (Dichpally mandal) ఆయా గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, ఏడో బెటాలియన్ పోలీసులు టోర్నమెంట్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అంతకుముందు 16 జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త గాదె కృష్ణ, క్రికెట్ టోర్నీ ఆర్గనైజింగ్ ఛైర్మన్ వినోద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చింతల గంగాదాస్, వైద్యులు దీపక్ రాథోడ్, జమాల్పూర్ రాజశేఖర్, ఆర్అండ్బీ విశ్రాంత అధికారి శ్రీమన్నారాయణ, నడిపల్లి తండా సర్పంచ్ శాంతిలాల్, ఉపసర్పంచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.