HomeజాతీయంPresident Murmu | రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి

President Murmu | రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ​ ద్రౌపదీ ముర్ము రఫేల్​ యుద్ధ విమానంలో విహరించారు. అంబాలా వైమానిక స్థావరం నుంచి ఆమె విమానంలో ప్రయాణించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: President Murmu | భారత రాష్ట్రపతి, త్రివిద దళాల సుప్రీం కమాండర్​ ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) రఫేల్​ యుద్ధ విమానంలో విహరించారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి బుధవారం ఆమె రఫేల్ యుద్ధ విమానంలో (Rafale Fighter Jet) ప్రయాణించారు.

వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యేక్షంగా వీక్షించారు. ఆయన అదే వైమానిక స్థావరం నుంచి స్పెరేట్ విమానంలో ప్రయాణించారు. ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ పీవోకే, పాక్​లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్​లో రఫేల్​ జెట్లు కీలకంగా వ్యవహరించాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రపతి యుద్ధ విమానంలో విహరించడం గమనార్హం.

President Murmu | గతంలో సుఖోయ్​ విమానంలో..

రాష్ట్రపతి జి సూట్​ ధరించి రఫేల్​ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అంతకు ముందు ఆమెకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కాగా.. ముర్ము 2023 ఏప్రిల్​లో అస్సాంలోని తేజ్‌పూర్ వైమానిక దళ స్టేషన్‌లో సుఖోయ్-30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ సైతం గతంలో పూణే సమీపంలోని లోహెగావ్‌లోని వైమానిక దళ స్టేషన్‌లో సుఖోయ్-30 యుద్ధ విమానంలో వివహరించారు.

President Murmu | ఫ్రాన్స్​ నుంచి..

ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను సెప్టెంబర్ 2020లో అంబాలాలోని వైమానిక దళ స్టేషన్‌లో అధికారికంగా భారత వైమానిక దళం (Indian Air Force) లో చేర్చారు. 2020 జూలై 27న ఫ్రాన్స్ నుంచి వచ్చిన మొదటి ఐదు రాఫెల్ విమానాలను 17వ స్క్వాడ్రన్ ‘గోల్డెన్ యారోస్’లో చేర్చారు. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న భూభాగాల్లోని అనేక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ జెట్లను ఉపయోగించారు.