అక్షరటుడే, మెండోరా : Mendora Mandal | మండలంలోని పోచంపాడ్ చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి–44పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
Mendora Mandal | ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) పేరుతో ఇబ్బందులు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా.. నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా మెండోరా ఎస్సై సుహాసిని (SI Suhasini) నేతృత్వంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో దూద్గాం సర్పంచ్ బాబా, పోచంపాడ్ ఉప సర్పంచ్ సతీష్, మాజీ సర్పంచ్ మిస్బా, టౌన్ ప్రెసిడెంట్ రాజుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.