అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: police | నిజామాబాద్ నగరం (Nizamabad city) లో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగుంట కాలనీ సుభాష్ Subhash నగర్ లో ఉన్న రవితేజ మెస్ వెనుకాల మంగళవారం పలువురు జూదరలు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.
ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ Police Station పోలీసులు దాడులు చేపట్టారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
police | నగదు స్వాధీనం..
వారి వద్ద నుంచి రూ. 17,250 నగదు, 6 సెల్ ఫోన్లు(cell phones), 2 బైక్లు bikes, 52 పేకాట ముక్కలని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.