253
అక్షరటుడే, హైదరాబాద్: Police Inspectors Transfers | తెలంగాణలోని మల్టీ జోన్–1 పరిధిలో పోలీస్ అధికారుల కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు.. 12 మంది సివిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ మల్టీ జోన్–1 ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల నిమిత్తం ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. పోలీస్ శాఖలో పరిపాలనా సమర్థత పెంచే దిశగా ఈ బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.
Police Inspectors Transfers | వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగులు
- ఐజీపీ కార్యాలయంలో ఇప్పటివరకు వెయిటింగ్లో ఉన్న పలువురు ఇన్‌స్పెక్టర్లకు క్షేత్రస్థాయి పోస్టింగులు ఇచ్చారు.
- మల్టీ జోన్–1 ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న ఎం.డి. హన్నాన్కు రామగుండం CSBలో పోస్టింగ్ ఇచ్చారు.
- ICCCలో డిప్యుటేషన్లో ఉన్న గోపతి రవీందర్‌ను జగిత్యాల VRకు బదిలీ చేశారు.
- సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ రూరల్ సర్కిల్‌కు దండుగుల రవి రాజును బదిలీ చేశారు.
- పింగిలి మహేందర్ రెడ్డి, లక్కేపురం శ్రీను, భుక్య రవి కుమార్‌లను ఐజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నిర్మల్, భైంసా, సిద్దిపేటలో..
- నిర్మల్ టౌన్ SHO మద్దినేని ప్రవీణ్ కుమార్ ను భైంసా రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు.
- భైంసా రూరల్ సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎం. నైలును నిర్మల్ టౌన్ PS SHOగా నియమించారు.
- GRP టి. లక్ష్మీబాబుకు సిద్దిపేట–III టౌన్ PS SHOగా పోస్టింగ్ ఇచ్చారు.
- సిద్దిపేట–III టౌన్ PSలో విధులు నిర్వహిస్తున్న విద్యాసాగర్‌ను మల్టీ జోన్–1 ఐజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మహబూబాబాద్–భద్రాద్రి జిల్లాల్లో..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న లోగిడ రవీందర్.. మహబూబాబాద్ జిల్లా గర్ల బయ్యారం సర్కిల్‌కు బదిలీ అయ్యారు.
- గర్ల బయ్యారం సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న భుక్య రవి కుమార్‌ను ఐజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.