అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Election Inspection | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో ఎల్లారెడ్డిలో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఎస్సై సుబ్రహ్మణ్య చారి (SI Subrahmanya Chari) ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్ ప్రత్యేక బృందాల సమన్వయంతో మినీ ట్యాంక్‌బండ్ (Mini Tank Bund) వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Yellareddy Election Inspection | అక్రమ మద్యం, నగదు నేపథ్యంలో..
అక్రమమద్యం, అనుమానాస్పద నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Yellareddy Election Inspection | హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రమాదకరం..
అదే సమయంలో హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ, రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.