అక్షరటుడే, కామారెడ్డి : Neelam Kalavati Ramesh | వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి (Devunipalli) 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిని నీలం కళావతి రమేష్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె వార్డులో పర్యటించారు.
Neelam Kalavati Ramesh | ఇంటింటికీ తిరుగుతూ..
వార్డులోని ఆయా కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ నీలం కళావతి రమేష్ ఓటును అభ్యర్థించారు. తనను గెలిపిస్తే చేయబోయే పనులను ఓటర్లకు వివరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. వృద్ధులను, యువకులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
Neelam Kalavati Ramesh | యువత భాగస్వామ్యంతో..
ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. తమ విలువైన ఓటును అభివృద్ధి చేసేవారికి వేయాలని కోరారు. తాను గెలిచాక యువత భవిష్యత్‌కు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తానన్నారు. చదువుకునే విద్యార్యులకు బాసటగా నిలుస్తానని వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తన సహకారం ఉంటుందని తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తానని చెప్పారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని, అర్హులైన వారికి పింఛన్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.