ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలతో హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్‌) దాఖలైంది.

    విజయవాడకు చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు(Retired Railway Employee Y. Kondala Rao) ఈ పిల్‌ను దాఖలు చేశారు. తన పిటిషన్‌లో కొండలరావు, ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాల ప్రదర్శనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధానం రూపొందించలేదని పేర్కొన్నారు. దీనివల్ల అనుమతి లేకుండానే రాజకీయ నాయకుల చిత్రాలు ప్రభుత్వ ఆఫీసు(Government Office)ల్లో పెట్ట‌డం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రభుత్వం స్పష్టమైన విధానం రూపొందించే వరకు పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాలన్నది ఆయన అభ్యర్థన.

    High Court | త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలి..

    ఈ కేసులో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టు(High Court)ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఈ పిల్‌పై విచారణ జరపనుంది. చిత్రపటాల ప్రదర్శనపై ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు, సర్క్యులర్ల వివరాల కోసం కొండలరావు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందనగా సమాచార, పౌరసంబంధాలశాఖ “ప్రస్తుతం ఈ అంశంపై ఎలాంటి జీఓలు లేదా మార్గదర్శకాలు లేవు. సీఎం, ఉప ముఖ్యమంత్రి(Deputy CM Pawan Kalyan) చిత్రపటాలను ప్రదర్శించమని ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ కాలేదు” అని పేర్కొంది.

    రాజ్యాంగంలోని అధికరణ 164 ప్రకారం “ఉప ముఖ్యమంత్రి” అనే పదవి ప్రస్తావించబడలేదని, సీఎం, మంత్రులను గవర్నర్ నియమించే అంశం మాత్రమే ఉన్నదని కొండలరావు పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం అధికారికంగా పవన్‌ కల్యాణ్‌ చిత్రపటాలను సీఎం చిత్రపటాల పక్కన ప్రదర్శించడం వలన రెండు పదవులకు సమాన రాజ్యాంగబద్ధ స్థాయి ఉన్నట్టుగా తప్పుబట్టే భావన ప్రజల్లో కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతిష్టను పెంచేందుకు ప్రజాధనాన్ని వినియోగించడం సుప్రీంకోర్టు(Supreme Court) గత తీర్పులకు వ్యతిరేకమని కొండలరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నాన్-కానిస్టిట్యూషనల్ పదవిని ముఖ్యమంత్రి స్థాయికి చేరదీసేలా ప్రయత్నించడం రాజ్యాంగ వ్యవస్థ పట్ల అవమానమని అభిప్రాయపడ్డారు.

    More like this

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...