అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SIT Enquiry | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం విచారణకు హాజరవుతానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad)లోని నందినగర్‌లో గల ఆయన ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో సిట్ అధికారులు (SIT Officers) విచారణ ప్రారంభించారు. విచారణ సందర్భంగా కేసీఆర్ న్యాయవాదులకు సిట్ అధికారులు అనుమతిని నిరాకరించారు.
SIT Enquiry | విచారణలో ఐదుగురు బృందం
కేసీఆర్‌ను విచారణ ఐదుగురు సభ్యుల సిట్ బృందం ఉంది. వీరిలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్ (Madhapur DCP Reethiraj)తో పాటు ఐపీఎస్‌లు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్‌కుమార్, కేఎస్ రావు ఉన్నారు.
SIT Enquiry | నాయకులు వెళ్లిపోవాలని ఆదేశం
నందినగర్ (Nandinagar)లోని కేసీఆర్ విచారణ సందర్భంగా హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. కాగా.. అందర్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా కేసీఆర్ నివాసం వద్ద నాలుగు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ఎవరిని అనుమతించడం లేదు. అలాగే చుట్టు పక్కల సైతం బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Leaders) ఆందోళన చేపట్టకుండా చర్యలు చేపట్టారు.