అక్షరటుడే, మెండోరా : Mendora | మండల పరిధిలోని బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ (Petrol Tanker) బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
Mendora | హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా..
మెండోరా ఎస్సై సుహాసిని (SI Suhasini) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నుంచి నిర్మల్‌కు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బుస్సాపూర్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న మెండోరా (Mendora) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ ట్యాంకర్ కావడంతో వాహనం వద్దకు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
