Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మొదటి దశలో అద్దె ప్రాంగణంలో పనిచేస్తున్న 60 తహశీల్దార్ కార్యాలయాలు, 5 RDO కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మిస్తామన్నారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలను పునర్​ నిర్మిస్తామని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

మొదటి దశలో అద్దె ప్రాంగణంలో పనిచేస్తున్న 60 తహశీల్దార్ కార్యాలయాలు, 5 RDO కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మిస్తామన్నారు. రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలను పునర్​ నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని భవనాలు ఒకేరకంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో చర్చించిన తర్వాత డిజైన్లను ఖరారు చేస్తామని చెప్పారు.

Permanent Tahsildar Offices | అధికారులతో సమీక్ష

సచివాలయంలో సీనియర్ రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న కార్యాలయాల సంఖ్య, శిథిలావస్థకు చేరిన భవనాల వివరాలు సేకరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి, అధునాతన సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, పటాన్‌చెరులలో ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయన్నారు. గచ్చిబౌలిలో నిర్మాణం చివరి దశలో ఉందని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరించడానికి, వేగవంతమైన సేవలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.