అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | నిజామాబాద్ పోలీస్కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో (Command Control Hall) సమీక్ష జరిగింది.
Nizamabad CP | ప్రణాళికతో ముందుకెళ్లాలి..
పెండింగ్ కేసుల (pending cases) పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీపీ అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో పారదర్శకంగా నేర పరిశోధన చేయాలని సూచించారు. కేసు నమోదు నుండి ఛార్జీషీట్ వరకు ప్రతివిషయాన్ని కులంకశంగా పరిశోధన చేసి తుదినిర్ణయం తీసుకోవాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో (POCSO and grave cases) త్వరితగతిన ఇన్వేస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో ఛార్జీషీటు దాఖాలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారికి సీసీటీఎన్ఎస్పై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
Nizamabad CP | దీర్ఘకాలిక పెండింగ్ కేసులపై..
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగుచర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త కేసులతో పాటు చాలాకాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు.
Nizamabad CP | వీపీవోలు గ్రామాలను సందర్శించాలి..
గ్రామ పోలీస్ అధికారులు (వీపీవో) (Village Police Officers) ప్రతిరోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ.. నేర నియంత్రణకు కృషి చేయాలని సీపీ సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ క్రైం, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు వివరించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైనట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్సీఆర్పీ https://www.cybercrime.gov లో పోర్టల్ నమోదు చేయించాలన్నారు.
Nizamabad CP | బ్లాక్ స్పాట్లను గుర్తించాలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లుగా (black spots) గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఓవర్ స్పీడ్, ట్రిబుల్ డ్రైవింగ్ (triple driving), మైనర్లు వాహనాలు నడపకుండా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా క్రయవిక్రయాలపై, జూదంపై ఓ కన్నేసి ఉంచాలని.. మళ్లీ మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడితే పీడీయాక్ట్కు రిఫర్ చేయాలని సూచించారు. సమీక్షలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీష్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
