- Advertisement -
HomeUncategorizedPellikani Prasad | ఓటీటీలో సంద‌డి చేస్తున్న స‌ప్తగిరి పెళ్లికాని ప్ర‌సాద్.. సూప‌ర్బ్ రెస్పాన్స్

Pellikani Prasad | ఓటీటీలో సంద‌డి చేస్తున్న స‌ప్తగిరి పెళ్లికాని ప్ర‌సాద్.. సూప‌ర్బ్ రెస్పాన్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pellikani Prasad | క‌మెడీయ‌న్ స‌ప్త‌గిరి (Sapthagiri) కామెడీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన చాలా చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి.

ఇక తాజాగా ఆయ‌న పెళ్లి కాని ప్రసాద్ (Pellikani Prasad) అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు . మార్చి 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద నవ్వులు పూయించి మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. జూన్ 5(గురువారం) నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో (ETV Win) స్ట్రీమింగ్ అవుతుంది. థియేట‌ర్‌లో మూవీకి ఎంత రెస్పాన్స్ వ‌చ్చిందో ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ మూవీలో సప్తగిరి, ప్రియాంక శర్మ హీరో (Saptagiri and Priyanka Sharma) హీరోయిన్లుగా నటించగా.. అభిలాష్ రెడ్డి గోపిడి(Director Abhilash Reddy Gopidi) దర్శకత్వం వహించారు.

- Advertisement -

Pellikani Prasad | సూప‌ర్భ్ కామెడీ..

తెలంగాణలోని (Telangana) నిజామాబాద్ మట్టిలో సాధారణ కుర్రాడిగా పుట్టిన ద‌ర్శ‌కుడు అభిలాష్ రెడ్డి (abhilash reddy gopidi) త‌న కలలకు రూపమిస్తూ, నవ్వుల వెనక వినూత్న సందేశాన్ని మిళితం చేసి “పెళ్లి కాని ప్రసాద్” (Pelli Kaani Prasad) అనే ప్రత్యేకమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా తెలంగాణలోని పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రేక్షకుల ప్రేమ, మాటల్లో నవ్వులు, కథలో కొత్తదనం అన్నీ కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి.

మ‌ల్లీశ్వ‌రి సినిమాలోని విక్ట‌రీ వెంక‌టేశ్ (Victory Venkatesh) పేరుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టడంతో మూవీకి మంచి బ‌జ్ వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 70 రోజుల త‌ర్వాత ఇప్పుడీ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు (digital stream) వ‌చ్చింది. ఓటీటీలోను అద‌ర‌గొడుతున్న ఈ చిత్రాన్ని మీరు మిస్ కాకుండా చూడండి. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ప్రసాద్ (సప్తగిరి)కు 38 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మలేషియాలో మంచి ఉద్యోగం చేస్తూ భారీగా ప్యాకేజీ తీసుకుంటున్నా కూడా పెళ్లి కాదు. దానికి కార‌ణం వాళ్ల నాన్న‌. తన కొడుకుకి రూ.2 కోట్లు కట్నం ఇచ్చే సంబంధం వస్తే తప్ప పెళ్లి చేయన‌ని కూర్చుంటాడు ప్రసాద్ తండ్రి (మురళీధర్ గౌడ్). చివరకు ఓ సంబంధం సెట్ అయితే.. దాని కోసం ఇండియాకు తిరిగివస్తాడు ప్రసాద్. అయితే.. అనుకోని కారణాలతో ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది.

మరోవైపు.. ప్రియ (ప్రియాంక శర్మ) తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లు కంటుంది. ఇందుకోసం ఓ ఎన్నారై సంబంధం (NRI relationship) కోసం చూస్తుంటుంది. ఈ క్రమంలో ప్రసాద్ (Prasad) గురించి తెలిసి అతన్ని పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీ అంతా విదేశాల్లో స్థిరపడొచ్చ‌నే ఆలోచ‌న చేస్తుంది. ఈ క్ర‌మంలో ప్రియతో ప్రసాద్ పెళ్లి జ‌రుగుతుంది. కాని పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి షాక్ అవుతుంది ప్రియ. ఆ తర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి? ప్రసాద్ విదేశాలకు వెళ్లాడా? ప్రియ కోరిక నెరవేరిందా? ఏ కండీష‌న్స్ వారిద్ద‌రు పెట్టుకున్నారు? అనేవి తెలియాలంటే పెళ్లి కాని ప్ర‌సాద్ చిత్రాన్ని ఓటీటీలో చూడాల్సిందే..!

- Advertisement -
- Advertisement -
Must Read
Related News