HomeUncategorizedVisakhapatnam Mayor | విశాఖ మేయర్​గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

Visakhapatnam Mayor | విశాఖ మేయర్​గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Visakhapatnam Mayor | గ్రేటర్‌ విశాఖపట్నం మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. జీవీఎంసీ (GVMC) పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ సమావేశం జిల్లా జాయింట్​ కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.

మేయర్‌గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్‌ రావు mayor peela srinivasa rao పేరును జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌ mla vamshi krishna Yadav ప్రతిపాదించారు. కాగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు బలపరిచారు. దీంతో మేయర్‌ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. కాగా.. మేయర్‌ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.