HomeUncategorizedJawan Murali Nayak | వీర‌మ‌ర‌మ‌ణం చెందిన ముర‌ళీ నాయ‌క్.. బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్...

Jawan Murali Nayak | వీర‌మ‌ర‌మ‌ణం చెందిన ముర‌ళీ నాయ‌క్.. బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jawan murali nayak | గ‌త రెండు మూడు రోజులుగా బోర్డ‌ర్‌లో ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయో మ‌నం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సిందూర్ operation sindoor నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ Pakistan మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. జమ్మూకశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ (jawan murali nayak) అమరుడయ్యాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం (sathyasai district penukonda constituency) గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ కళ్లితాండ గ్రామం. కాగా, ఆయ‌న వీర‌మ‌ర‌ణం చెందార‌ని తెలిసి కుటుంబ స‌భ్యుల‌తో పాటు గ్రామ ప్ర‌జ‌లు కూడా క‌న్నీరుమున్నీరు అవుతున్నారు.

jawan murali nayak | ప్రముఖుల నివాళులు..

మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (AP CM chandrababu), మంత్రి నారా లోకేష్ (minister nara lokesh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మురళీ నాయక్ వీర మరణాన్ని జాతి మరచిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (deputy CM pawan kalyan). ‘ఆపరేషన్ సిందూర్ లో (operation sindoor) వీర మరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ (jawan murili nayak) గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో (jammu and kashmir borders) శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందిన భారత జవాన్ మురళీ నాయక్ (indian jawan shri murali nayak) ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లితండ్రులు జ్యోతి బాయి, శ్రీరామ్ నాయక్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం (state governament) అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది’ అని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

‘మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీరుడైన మురళి నాయక్ కు అశ్రునివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra babu) ఫోన్‌లో పరామర్శించారు. దేశ రక్షణలో మురళినాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.