అక్షర టుడే, ధర్పల్లి: Nizamabad Collector | ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy) అన్నారు. ధర్పల్లి మండలకేంద్రంలోని (Dharpalli mandal center) సీహెచ్సీని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.
మహిళల ఆరోగ్యం కోసం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా సీహెచ్సీలో చేపడుతున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిబిరాల నిర్వహణపై ముందుగానే గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
మొబిలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి, శిబిరాలకు తరలించాలన్నారు. మెరుగైన ఆరోగ్య సేవలు అవసరమైన వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (government general hospital) రిఫర్ చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, మండలంలో అమలు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమ తీరును పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహశీల్దార్ శాంతను ఆదేశించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. గడువు లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.