అక్షరటుడే, ఆర్మూర్: Collector Ila Tripathi | పార్టీ గుర్తులపై పోటీచేసే అభ్యర్థులు విధిగా బీఫాం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో (Armoor municipal elections) భాగంగా బాలికల కళాశాలలోని నామినేషన్ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు.
Collector Ila Tripathi | బీఫాం సడ్మిట్ చేయకపోతే..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బీఫాం సబ్మిట్ చేయని వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ మున్సిపల్ (Armoor municipality) పరిధిలో 36 వార్డులకు బాలికల కళాశాలలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఆరు గదులను ఏర్పాటు చేసి రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
Collector Ila Tripathi | మూడు భాషల్లో నామినేషన్ పత్రాలు..
నామినేషన్ పత్రాలను మూడు భాషల్లో అందరికీ అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. పోలింగ్ రోజు వికలాంగులకు ప్రత్యేకంగా వీల్చైర్లు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ సత్యనారాయణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.