Pahalgam | భూతల స్వర్గం.. పహల్​గామ్​.. మినీ స్విట్జర్​ల్యాండ్​గా పేరు గాంచిన ప్రాంతం..
Pahalgam | భూతల స్వర్గం.. పహల్​గామ్​.. మినీ స్విట్జర్​ల్యాండ్​గా పేరు గాంచిన ప్రాంతం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam | కాశ్మీర్ Kashmir అంటేనే ప్రకృతి nature అందాలకు నెలవు. ప్రపంచ పర్యాటకులు world tourists అమితంగా ఇష్టపడే ప్రాంతమిదే. ఎత్తయిన మంచు పర్వతాలు, దట్టమైన వృక్షాలు, ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లకు చిరునామా ఇక్కడి బైసరన్ ప్రాంతం. పర్యాటకంపైనే ఈ ప్రాంతం ఆధారపడి ఉంది. అనంత్నాగ్ జిల్లాలోని Anantnag district పెహల్గామ్ Pahalgam మంచుపర్వతాలకు, పచ్చిక బయళ్లకు పెట్టింది పేరు. వేసవిలో summer మినహా మిగతా రోజుల్లో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది.

Pahalgam | మినీ స్విట్జర్లాండ్ బైసరన్..

మంచు పర్వతాలకు, ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, దట్టమైన వృక్షసంపదతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే బైసరన్ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు. భూతల స్వర్గంగా చెప్పుకునే ఈ ప్రాంతానికి వేసవిలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. బైసరన్ పచ్చిక బయళ్ల చుట్టూ దట్టమైన పైన్ అడవులు విస్తరించి ఉన్నాయి.

వాటి వెనుక కనిపించే పెద్ద పెద్ద మంచుకొండలు కట్టి పడేస్తాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే లిడ్డర్ నది మరో ప్రధాన ఆకర్షణ. శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతం అంతులేని ఆహ్లాదాన్ని పంచుతుంటుంది. ఇక్కడకు కాలినడకన లేదా గుర్రాలపైన మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. పహల్గామ్ నుంచి 3 వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లే వారు బైసరన్ పచ్చిక బయళ్ల మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది.

Pahalgam | రక్తంతో తడిసిన పచ్చిక బయళ్లు

ప్రపంచ పర్యాటకులతో సందడిగా మారిన బైసరన్ ప్రాంతంలో అకస్మాత్తుగా గర్జించిన ఉగ్రమూకల తుపాకులు దేశంలో అంతులేని విషాదాన్ని నింపాయి. అప్పటిదాకా పచ్చిక బయళ్లను, ప్రకృతి అందాలను చూస్తూ ఆనందంగా గడిపిన పర్యాటకులపై కాల్పులు జరిపారు. మంగళవారం జరిగిన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బైసరన్ పచ్చిక బయళ్లు రక్తసిక్తమయ్యాయి.