అక్షరటుడే, కామారెడ్డి : Palvancha BJP Protest | ఓవైపు కార్యకర్తల సమావేశం జరుగుతుండగా తమను రెచ్చగొట్టేందుకే ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR) దిష్టిబొమ్మను దహనం చేశారని పాల్వంచ బీజేపీ నాయకులు మండిపడ్డారు. పాల్వంచ మండల కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
Palvancha BJP Protest | షబ్బీర్‌పై విమర్శలకు సమాధానం చెప్పలేక..
షబ్బీర్ అలీ (Shabbir Ali)పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేకనే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ నాయకులు (BJP Leaders) ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై షబ్బీర్ అలీ స్పందించాలని డిమాండ్ చేశారు. కేవీఆర్ ను విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని విమర్శించారు. ఎమ్మెల్యే ఎక్కడికి రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, అన్ని గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. రూ.150 కోట్లు సొంత నిధులతో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారన్నారు.
Palvancha BJP Protest | బరాబర్ గ్రామాల్లో ఎమ్మెల్యే తిరుగుతారు..
గ్రామాల్లో ఎమ్మెల్యే ఎలా తిరుగుతాడో చూస్తామని కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) అంటున్నారని, ఆయన స్థానిక ఎమ్మెల్యే అని బరాబర్ తిరుగుతారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాము తలుచుకుంటే మంత్రిని అడ్డుకోగలమని, తమకు తమ నాయకుడు హుందాగా ఉండడం నేర్పించారని చెప్పారు. కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షుడు పోసు అనిల్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తోట బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి నర్సింహా చారి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సత్యం యాదవ్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సురేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పరశురాం యాదవ్, లింగం, బాలరాజు పాల్గొన్నారు.