HomeUncategorizedLondon | భారతీయుల పీక కోస్తామన్న పాక్​ అధికారి

London | భారతీయుల పీక కోస్తామన్న పాక్​ అధికారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | పాకిస్తాన్ pakistan​ తన తీరు మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని  terrorism పెంచి పోషిస్తున్న ఆ దేశం బహిరంగంగానే వారికి మద్దతు తెలుపుతోంది. ఆ దేశ నాయకులతో పాటు అధికారులు భారతీయులపై విషం చిమ్ముతున్నారు. పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack పాల్పడిన వారు స్వాతంత్య్ర సమరయోధులని పాక్​ ఉప ప్రధాని శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లండన్​లోని పాక్​ హైకమిషర్​లోని ఓ అధికారి భారతీయుల పీక కోస్తామంటూ సైగలు చేశాడు.

పహల్గామ్​ దాడికి వ్యతిరేకంగా లండన్​లో london ఎన్​ఆర్​ఐలు NRI’s నిరసన తెలిపారు. పాకిస్తాన్​ హై కమిషనర్​ అధికారి వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పీక కోస్తామంటూ బెదిరింపులకు దిగాడు. అభినందన్​ వర్దమాన్​ చిత్రం చూపిస్తూ సైగలు చేయడం గమనార్హం. దీంతో భారతీయులు పాక్​ హైకమిషన్​ లోనికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సదరు అధికారి తీరును నిరసిస్తూ ఎన్​ఆర్​ఐలు అక్కడే నిరసన తెలిపారు. దీంతో లండన్​ పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. కాగా ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.