HomeUncategorizedTerror Attack | స్థానిక తిరుగుబాట్ల‌తోనే ఉగ్ర‌దాడి.. త‌మ‌కు సంబంధం లేదన్న పాక్‌

Terror Attack | స్థానిక తిరుగుబాట్ల‌తోనే ఉగ్ర‌దాడి.. త‌మ‌కు సంబంధం లేదన్న పాక్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Terror Attack |జ‌మ్మూకాశ్మీర్‌లో జ‌రిగిన దారుణ మార‌ణ‌కాండ‌పై పాకిస్తాన్(Pakistan) వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించింది. అది భార‌త్‌(India)కు వ్య‌తిరేకంగా జ‌రిగిన విస్తృత తిరుగుబాటులో భాగ‌మ‌ని అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. పహల్గామ్‌లో పర్యాటకులపై(Tourist) జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ తొలిసారి స్పందించింది. హ‌వ‌ల్గామ్‌లో జ‌రిగిన హింస భారతదేశానికి వ్యతిరేకంగా విస్తృత తిరుగుబాటులో భాగమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defense Minister Khawaja Asif) అన్నారు. ఇందులో ఇస్లామాబాద్‌(Islamabad)ను ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. పాక్ పాత్ర‌పై భార‌త్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించక ముందే ఆసిఫ్ ప్రతిదాడిని ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. “దీని(దాడి)తో పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదు” అని ఆయన నొక్కి చెప్పారు.

Terror Attack | స్థానిక తిరుగుబాట్లే..

భార‌త్‌లో జ‌రుగుతున్న విప్ల‌వాలు, తిరుగుబాట్లే దీనికి కార‌ణ‌మై ఉండొచ్చని పాక్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. “భారతీయ రాష్ట్రాలుగా పిలవబడే వాటిలో, నాగాలాండ్ నుంచి కాశ్మీర్ వరకు, ఛత్తీస్‌గఢ్, మణిపూర్, దక్షిణ ప్రాంతాలలో విప్లవాలు జరుగుతున్నాయి. ఇందులో విదేశీ జోక్యం లేదు, కేవ‌లం స్థానిక తిరుగుబాట్లు మాత్ర‌మే ” అని అన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమూహాల నుండి వచ్చే సీమాంతర ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్‌లో అశాంతికి ఆజ్యం పోస్తుందనే ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. పైగా భార‌త ప్ర‌భుత్వం(India Government)పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. మైనార్టీలు, క్రైస్త‌వులు, ముస్లింల‌ను అణ‌చి వేస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఈ విధంగా ప్ర‌తిస్పందిస్తున్నారని పేర్కొన్నారు. “హిందూత్వ శక్తులు మైనారిటీలను, క్రైస్తవులను, బౌద్ధులను, ముస్లింలను అణచివేస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రతిస్పందిస్తున్నారు” అని అన్నారు.పైగా బ‌లూచ్‌లో జ‌రుగుతున్న పోరాటాన్ని భార‌త్‌పైకి నెట్టేసే ప్ర‌య‌త్నం చేశాడు. “భారతదేశం బలూచిస్తాన్‌(Balochistan)లో అశాంతికి స్పాన్సర్ చేస్తోంది. పాకిస్తాన్‌లో అస్థిరత వెనుక భారతదేశం హస్తం ఉందని మేము ఒకసారి కాదు, పదేపదే అనేకసార్లు ఆధారాలను సమర్పించాము” అని ఆయన అన్నారు