HomeUncategorizedCeasefire Violation | పాక్ వక్రబుద్ధి.. సరిహద్దులో మళ్లీ కాల్పులు

Ceasefire Violation | పాక్ వక్రబుద్ధి.. సరిహద్దులో మళ్లీ కాల్పులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ceasefire Violation | కాల్పుల విరమించుకున్నట్లు భారత్-పాక్‌ ప్రకటించిన గంటల వ్యవధిలోనే సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత మోగించింది.

కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ పాల్పడింది. భారత్‌పై మళ్లీ దాడులకు తెగబడింది. ఎల్‌వోసీలో మళ్లీ కాల్పుల మోత మోగించింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులతో పాక్‌ కయ్యానికి కాలు దువ్వుతోంది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో జమ్ముకశ్మీర్‌లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు.

ఉదంపూర్‌, నౌషెరా, పూంఛ్‌, సుందర్‌బని, ఆర్నియా, రాజస్థాన్‌లోనూ.. బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నారు. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో.. సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్‌ఫైర్ ఏమైందని ప్రశ్నించారు. “శ్రీనగర్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు వినిపించాయి. శ్రీనగర్‌లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఇది సీజ్‌ఫైర్ కానే కాదంటూ..” వీడియో షేర్ చేశారు ఒమర్ అబ్దుల్లా.

జమ్మూ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాకిస్తాన్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ కూడా వినడం లేదని.. కాల్పుల విరమణను పాక్ ఆర్మీ ధిక్కరిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు, ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదేమైనా అమెరికా అధ్యక్షుడు స్వయంగా రంగంలోకి దిగి.. ఇదే దేశాలు కాల్పుల విరమణ చేసేలా రాజీ కుదిర్చారు. ఇంతలోనే తిరిగి పాక్ సైన్యం మళ్లీ డ్రోన్లతో దాడులు చేయడం కేంద్రం సీరియస్ అయ్యింది.