HomeUncategorizedPahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

Pahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్గావ్ pahalgam terrorist attack ఉగ్రదాడి తర్వాత భారత్‌ – పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ border వెంట రెచ్చగొట్టే ధోరణితో పాక్‌ ఆర్మీ pak army మరోసారి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అప్రమత్తమై సమర్థంగా తిప్పికొట్టింది.

(ఏప్రిల్‌ 25-26) అర్ధరాత్రి మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్‌ ఆర్మీ సేనలు కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. గురువారం(ఏప్రిల్‌ 24-25) అర్ధరాత్రి వేళ కూడా ఎల్ఓసీ వద్ద పాక్‌ కాల్పులు జరిపింది.