ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియాగా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    CP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియాగా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్​వాడిలో (Khalilwadi) ట్రాఫిక్​ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలో అన్ని శాఖల సమన్వయంతో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

    ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) ఆధ్వర్యంలో గురువారం సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఖలీల్ వాడిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    ప్రధానంగా రాంగ్ పార్కింగ్ (Wrong parking), సెల్లార్ పార్కింగ్ తదితర విషయాలపై చర్చించారు. ఆస్పత్రులు, మెడికల్​ షాప్​లు, పార్కింగ్ స్థలాలు (parking Places), ఫుట్​పాత్​లు, ఎంక్రోచ్​మెంట్లు (Encroachments), అంబులెన్స్​ల గురించి వైద్యులు సూచనలు, సలహాలను సీపీ స్వీకరించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న సెక్యూరిటీ కౌన్సిల్ భవిష్యత్తులో అన్నిరకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.

    CP Sai Chaitanya | రాజీవ్​గాంధీ ఆడిటోరియంను..

    భవిష్యత్తులో రాజీవ్ గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium) పెయిడ్ పార్కింగ్​ ఏరియాగా ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు. 24 గంటలకు గాను.. కారుకు రూ.50, ఆటోకు రూ.30, బైక్​కు రూ.20 ఛార్జీ చేయనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ఆస్పత్రుల నిర్వాహకులు పేషెంట్ల కోసం వచ్చేవారికి సూచించాలని స్పష్టం చేశారు.

    ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మెడికల్ గైడ్​లెన్స్​ను (Medical guidelines) తూ.చా తప్పకుండా పాటించాలని సీపీ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వపరంగా జరిమానాలు, లైసెన్స్​లను రద్దు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, డీఎంహెచ్​వో రాజశ్రీ, అదనపు మున్సిపల్​ కమిషనర్​ రవి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, అసోసియేషన్​ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

    సీపీతో సమావేశంలో పాల్గొన్న ఖలీల్​వాడి ఆస్పత్రుల నిర్వాహకులు

    Latest articles

    Employees | హామీల అమలు కోసం ఉద్యమానికి సిద్ధం అవుతున్న ఉద్యోగులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employees | ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం...

    Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి తీవ్ర గాయాలు

    అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి గాయాలైన ఘటన మండలంలోని ఇందల్వాయి తండాలో (Indalwai...

    Nizamabad Police Commissionerate | తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్​..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police Commissionerate | జిల్లాలో 9 మంది కానిస్టేబుళ్లకు హెడ్​కానిస్టేబుళ్లకు (Head constables)...

    Bhikanoor | శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ ఉత్సవాలను జయప్రదం చేయండి

    అక్షరటుడే, భిక్కనూరు: Bhikanoor | భిక్కనూరులోని వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో (Vasavi Kanyaka Parameshwari Temple) నిర్వహించే...

    More like this