అక్షరటుడే, కోటగిరి: Collector Nizamabad | కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలోని సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రక్షీట్లపై సొసైటీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Collector Nizamabad | గన్నీ బ్యాగుల కొరత రానివ్వొద్దు..
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సొసైటీ సిబ్బందిని (society staff) ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం త్వరగా రైతుల ఖాతాల్లోకి (Farmers Accounts) డబ్బులు జమయ్యేలా చూడాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), డీసీవో శ్రీనివాస్ రావు, తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, చందర్, క్లస్టర్ ఆఫీసర్ అంబర్ సింగ్, ఎస్సై మరియా పుష్పకుమారి, ఏవో నిషిత, ఎండీ రియాజుద్దీన్, ఏఈవో సుప్రియ, సొసైటీ సిబ్బంది, రైతులు తదితరులున్నారు.