అక్షరటుడే, ఆర్మూర్: Operation Kagar | ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని సీపీఎం ఆర్మూర్ (CPM Armoor) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేశ్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని.. బూటకపు ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. కామ్రేడ్ నంబాల కేశవరావుతో (Nambala Kesava Rao) సహా 26 మంది ఆదివాసీ కామ్రేడ్లను ఎన్కౌంటర్ చేయడంపై విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ నాయకులు భూమన్న, బామండ్ల రవి, కుల్దీప్ శర్మ, నవీద్ తదితరులు పాల్గొన్నారు.
