అక్షరటుడే, వెబ్‌డెస్క్:Karre Guttalu | తెలంగాణ– ఛత్తీస్‌గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో గల కర్రెగుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఆపరేషన్ operation kagar కర్రెగుట్టలు పేరుతో 11 రోజుగా బలగాలు కూంబింగ్ (Combing) నిర్వహిస్తున్నాయి. అడవిలో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సైతం బలగాలు డ్రోన్లు, హెలీక్యాప్టర్ల సాయంతో ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టుల భారీ బంకర్(Maoist’s huge bunker)ను గుర్తించారు. అయితే బలగాల రాకతో అప్రమత్తమైన మావోయిస్టులు మరో ప్రాంతానికి తరలి వెళ్లారు.
Karre Guttalu | బేస్ క్యాంపుల ఏర్పాటు
కర్రెగుట్టుల్లోని రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అధికారులు అక్కడ ప్రస్తుతానికి బేస్ క్యాంపు(Base Camp) ఏర్పాటు చేశారు. భారీ భద్రత, డాగ్ స్క్వాడ్(Dog squad), మైన్ డిటెక్టర్(Mine Detector)లతో బేస్ క్యాంపు వద్ద తనిఖీలు చేపట్టారు.
అయితే ఇంకా చాలా గుట్టలు, సొరంగాలు ఉండటంతో కూంబింగ్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఆపరేషన్ సవాల్‌గా మారింది. అయినా హెలికాప్టర్లు, డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టులు (Maoist’s) సేఫ్‌జోన్‌లోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.