Delhi | ఢిల్లీలో హై అలర్ట్‌.. భద్రత పెంపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Delhi | పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత టెర్రరిస్టులు దేశ రాజధాని ఢిల్లీలో dellhi city దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రవాదులు 27 పర్యాటకులను(Tourists) అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్​ కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్​కు సింధు జలాలను(Indus River) ఆపేసింది. అయితే ఉగ్రవాదులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Delhi | పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత టెర్రరిస్టులు దేశ రాజధాని ఢిల్లీలో dellhi city దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ఇటీవల జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రవాదులు 27 పర్యాటకులను(Tourists) అతికిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్​ కఠిన చర్యలు చేపట్టింది. పాకిస్తాన్​కు సింధు జలాలను(Indus River) ఆపేసింది. అయితే ఉగ్రవాదులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

ముఖ్యంగా ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉందని సమాచారం. దీంతో ఢిల్లీ పోలీసులు (Delhi Police) అప్రమత్తం అయ్యారు. దేశ రాజధానిలోని టూరిస్ట్​ ప్లేస్(Tourists Place)​ల్లో భద్రతను భారీగా పెంచారు. అనుమానితులు కనిపిస్తే విచారిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్​ అధికారులతో(Intelligence Officers) సమన్వయం చేసుకుంటూ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...