అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొట్టింది. ఈ ఘటన నగరంలోని వర్ని రోడ్‌లోని (varni Road) ఆనంద్‌నగర్ (anand Nagar) వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్‌నగర్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఎదురుగా సైకిల్‌పై వస్తున్న నాగన్న అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో నాగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఐదో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే నాగన్న పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ (SI Gangadhar) తెలిపారు.