అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kasturba School | పట్టణంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో వసతుల లేమిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కస్తూర్బాలో తహశీల్దార్ ప్రేమ్, ఎంపీడీవో తాహెర బేగం, కస్తూర్బా జిల్లా అధికారి సుకన్య తనిఖీలు చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ (Collector Kamareddy) తనిఖీలకు ఆదేశాలివ్వగా వారు శుక్రవారం పరిశీలించారు.
Kasturba School | పరిసరాలు అపరిశుభ్రం..
కస్తూర్బాలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌పై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నీటి వసతి కల్పించకపోవడంపై మండిపడ్డారు. భోజనం సైతం సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులతో మాట్లాడిన అధికారులు జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. తమకు ఎలాంటి వసతులు కల్పించడంపై ప్రిన్సిపల్ శ్రద్ధ చూపడం లేదని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Kasturba School | అపరిశుభ్రంగా నీటివ్యవస్థ..
పాఠశాలలో నీళ్లు కూడా అపరిశుభ్రంగా ఉండడంతో తమకు చర్మ సంబంధిత వ్యాధులు (Skin diseases) వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ట్యాంక్ పాకురు పట్టి అపరిశుభ్రంగా ఉందని విద్యార్థులు అధికారులకు చూపించారు. భోజనం సైతం సక్రమంగా ఇవ్వడం లేదని పలువురు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో భోజనం చేశారు.