అక్షరటుడే, లింగంపేట: Lingampet | రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో (voter list) సవరణకు అభ్యంతరాల గడువు ఐదు రోజులకు పెంచాలని పలు పార్టీల నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో నరేశ్‌కు (MPDO Naresh) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల (political parties) ప్రతినిధులకు ఇప్పటివరకు ఓటరు జాబితాలు అందించలేదని పేర్కొన్నారు. తప్పుల సవరణకు శనివారం సమావేశం నిర్వహించి, అభ్యంతరాలు తెలపాలంటే ఎలా సాధ్యమన్నారు. అధికారులు ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితాలు అందించి, ఆపై అభ్యంతరాల కోసం గడువు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.