55
అక్షరటుడే, లింగంపేట : Lingampet | మండలంలోని పొల్కంపేట బీసీ కాలనీలోని ఎంపీపీఎస్ పాఠశాలలో (MPPS school) శనివారం పోషణ ఆహారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహారంపై (nutritious food) అవగాహన కల్పించారు.
పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసి తీసుకొచ్చిన వంటకాలను ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయుడు బత్తుల రాములు మాట్లాడుతూ.. స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే పోషకాల గురించి వివరించారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధురి, ఓంకార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.