HomeUncategorizedJunior NTR | చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైర‌ల్

Junior NTR | చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన ఎన్టీఆర్.. ట్వీట్ వైర‌ల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Junior NTR | ఈ ఆగస్టు 14న ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. బాలీవుడ్‌ హీరోలు హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా (War 2 Movie), సూపర్‌స్టార్ రజనీకాంత్‌ నటించిన ‘కూలీ’ చిత్రంతో (Coolie Movie) త‌ల‌ప‌డ‌నుంది. రెండు చిత్రాలు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు సినిమాల విడుదలకు ముందే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు చిత్రాలకూ గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రత్యేక జీవో విడుదల చేస్తూ, అదనపు షోలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు, టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

Junior NTR | ఎన్టీఆర్ ట్వీట్..

మంగళవారం సాయంత్రం కూలీ సినిమా టికెట్ రేట్ల (Ticket Rates) పెంపుపై అధికారిక సమాచారం రావడంతో, ‘వార్ 2’ అభిమానుల్లో అనిశ్చితి నెలకొంది. అయితే, తర్వాత వార్ 2కు కూడా అదే విధంగా ప్రభుత్వ అనుమతి రావడంతో తారక్ ఫ్యాన్స్‌కు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ..“వార్ 2 రిలీజ్ సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandra babu Naidu) గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పేలా చేశాడు జూ ఎన్టీఆర్. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను కాలర్ ఎగరేయడమే కాకుండా, హృతిక్ తో కూడా అదే చేయించడంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌ లో ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసిన సినిమాలు హిట్ అయిన నేపధ్యంలో, ఇదీ బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కి అయాన్ ముఖర్జీ (Ayan Mukhergee) దర్శకత్వం వహించారు. హృతిక్‌ రోషన్ – కియారా అద్వానీ (Kiara Advani) జోడీగా నటించగా, ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్ ఇప్పటికే అభిమానుల్లో హై వోల్టేజ్ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచాయి.

Must Read
Related News