అక్షరటుడే, హైదరాబాద్: NSR IMPULSE | పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రస్తుతం పరీక్ష కాలం కొనసాగుతోంది. ఎస్సెస్సీ తర్వాత ఇంటర్ కోసం ఏ కాలేజీని ఎంచుకోవాలి.. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఏ కోర్సు తీసుకోవాలనే దానిపై చాలా మంది తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతున్నారు.
ఓ వైపు ప్రైవేటు కళాశాలల వారు “మా కాలేజీలో చేర్పించండి.. అంటే మా కాలేజీలో చేర్పించండి..” అంటూ వెంట పడుతున్నారు.
“ఎలాగూ పదో తరగతి తర్వాత ఇంటర్ చదివించాలి.. అందుకు మంచి కాలేజీని ఎంచుకోవాలి..” కానీ, ఆ మంచి కాలేజీని ఎలా ఎంచుకోవాలో తెలియక పలువురు తల్లిదండ్రులు కాస్త ఒత్తిడికి లోనవుతున్నారు.
ఇలాంటి తరుణంలో కాలేజీ ఎంపిక విధానంపై స్పష్టత ఇస్తున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్మీడియట్ కాలేజీ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ నాలెడ్జ్ పార్క్ ఛైర్మన్ నలబోలు సీతారామయ్య.
యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే, ఇంటర్ స్థాయిలోనే సరైన విద్యతో పునాది పడాలంటున్నారు సీతారామయ్య.
గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచ స్థాయిలో పోటీతత్వం కొనసాగుతోంది. ఆ స్థాయిలో భారత విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు జేఈఈ ప్రశ్నాశైలిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కఠినంగా ఇస్తోంది.
అందుకే ప్రపంచంలో కఠినతరమైన టాప్ టెన్ పరీక్షల్లో మన జేఈఈ నిలిచిందంటున్నారు సీతారామయ్య. అంతటి ప్రాధాన్యం కలిగిన జేఈఈకి ఏటా దేశవ్యాప్తంగా 13 –14 లక్షల మంది పోటీ పడుతుంటారు.
అంతటి పోటీని తట్టుకుని మెరిట్ సాధించాలంటే.. విద్యార్థి ఏ స్థాయిలో ప్రిపేర్ కావాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీనియర్ ఫ్యాకల్టీ సమక్షంలో సరైన ప్రణాళికతో చదివితే ఐఐటీల్లో సీటు సాధించడం నల్లేరు మీద నడకేనంటున్నారు సీతారామయ్య.
ఇందుకు NSR IMPULSE జూనియర్ కాలేజీలో అమలు చేస్తున్న ప్రణాళికను ఉదహరిస్తున్నారు. ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా సాధిస్తున్న ఫలితాలను వివరిస్తున్నారు.
NSR IMPULSE జూనియర్ కాలేజీ..
మొదట ఎవరీ నలబోలు సీతారామయ్య.. ఏమిటీ ఈ NSR IMPULSE విద్యా సంస్థ అనేది తెలుసుకుందాం. ఫిజిక్స్ లెక్చరర్‌గా తన ప్రస్థానం ఆరంభించారు నలబోలు సీతారామయ్య. తన సబ్జెక్టు పరంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు.
కాగా, ప్రతిభ ఉన్నా కూడా సరైన మార్గదర్శకత్వం, సబ్జెక్టు నిష్ణాతులతో శిక్షణ, ప్రోత్సాహం అందక చాలా మంది విద్యార్థులు వెనుకబడి పోతున్నారని గుర్తించారు సీతారామయ్య.
నిష్ణాతులైన లెక్చరర్ల ఎంపిక, వారితో సరిగ్గా పనిచేయించుకుంటూ విద్యార్థులు సబ్జెక్టులలో పట్టు సాధించేలా కృషి మేనేజ్మెంట్ ఉంటే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయొచ్చని భావించారు.
ఆయన ఆలోచనలకు అనుగుణంగా మాథ్స్ లెక్చరర్ సదాశివ్ రావు, కెమిస్ట్రీ లెక్చరర్ మధుసూదన్ రావు జత కలిశారు. అలా 2016లో NSR IMPULSE విద్యా సంస్థల స్థాపనకు అంకురార్పణ చేశారు.
NSR IMPULSE : మార్గదర్శకత్వం, శిక్షణ..
సరైన మార్గదర్శకత్వం, శిక్షణ ఇస్తూ.. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచి జాతీయ స్థాయి జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో మెరిపిస్తున్నారు సీతారామయ్య.
సీనియర్ లెక్చరర్లచే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులలో ప్రతిరోజు ఐఐటీ-జేఈఈ, నీట్ – మెడికల్ ఫౌండేషన్ అందిస్తున్నారు.
విద్యార్థుల మౌలిక నైపుణ్యాలను బలపరచి, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులు
ఐఐటీ, నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలంటే సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులు అవసరం. అందుకే ఛైర్మన్ నలబోలు సీతారామయ్య అధ్యాపకుల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.
విద్యా బోధనకు అనుభవజ్ఞులైన అధ్యాపకులనే నియమిస్తారు. ఎప్పటికప్పుడు వారి నైపుణ్యాలను, బోధనా విధానాలను పర్యవేక్షిస్తూ.. పలు సూచనలతో మెరుగుపర్చుతుంటారు.
అలా ఛైర్మన్ పర్యవేక్షణలోనే సీనియర్ అధ్యాపకులు టీచింగ్ చేస్తుంటారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తుంటారు.
Integrated Curriculum
ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలను IIT-JEE / NEET సిలబస్‌తో సమన్వయం చేయడం NSR IMPULSE ప్రత్యేకతగా చెబుతున్నారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా Concept Based Learning ను ఎంచుకున్నట్లు సీతారామయ్య తెలిపారు.
- ప్రతి సబ్జెక్టులోనూ ఛాప్టర్ వైస్‌గా మొదట కంసెప్ట్ బోధిస్తారు.
- ఆ తర్వాత దానిని ప్రశ్నలకు ఎలా అప్లై చేయాలో వివరిస్తారు. అంటే పరీక్షల్లో క్వశ్చన్లు అడిగే విధానం, వాటికి సమాధానాలు ఎలా రాయాలో నేర్పుతారు.
- ఇక తదుపరి ఆబ్జెక్టివ్. ఇందులో నాలుగు మాడ్యూల్స్ ను పొందుపర్చారు. మొదటి మాడ్యుల్లో ఐపీ స్థాయి ప్రశ్నలు ఉంటాయి. అందులో క్లాస్ వర్క్, హోమ్ వర్క్ ప్రశ్నలపై ప్రాక్టీస్ చేయిస్తారు.
- క్లాస్ వర్క్ ప్రశ్నలను ఫ్యాకల్టీ వివరిస్తారు. హోంవర్క్ ప్రశ్నలను విద్యార్థులు సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- రెండో మాడ్యూల్లో ఎంసెట్ లెవెల్ క్లాస్ వర్క్, హోమ్ వర్క్ ప్రశ్నలు ఇస్తారు.
- మూడో మాడ్యూల్ లో JEE MAIN, నాలుగో మాడ్యూల్ లో JEE ADVANCED లెవెల్ క్లాస్ వర్క్, హోమ్ వర్క్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయిస్తారు.
మూడు గంటల పాఠ్య ప్రణాళిక (3 hours program)
మూడు గంటల ప్రోగ్రాం అనేది NSR IMPULSE లో ప్రత్యేకమైనదిగా పేర్కొంటున్నారు సీతారామయ్య. IIT-JEE/NEET లో ఇచ్చే ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్‌లో ఉంటాయి. వీటి ఫౌండేషన్ అందిండంలో టీచింగ్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయించడానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది.
కాగా, అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలను సాల్వ్ చేసే క్రమంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. వీటి నివృత్తికి సంబంధిత సీనియర్ సబ్జెక్టు లెక్చరర్ అందుబాటులో ఉండాల్సిందే.
ఎందుకంటే.. కాన్సెప్ట్ వింటే 60 శాతం అర్థం అవుతుంది. ప్రశ్నలను సాల్వ్ చేస్తేనే సబ్జెక్టు మీద పూర్తి పట్టు వస్తుంది. అందుకే ఛైర్మన్ సీతారామయ్య ఈ మూడు గంటల పాఠ్య ప్రణాళికను రూపొందించారు.
ఈ మూడు గంటల కార్యక్రమంలో సీనియర్ లెక్చరర్లు గంటన్నర పాటు పాఠ్యాంశం బోధిస్తారు. మరో గంటన్నర పాటు వారే స్టడీ అవర్ నిర్వహిస్తారు. మాడ్యూల్స్ లోని ప్రశ్నలను దగ్గరుండి సాల్వ్ చేయిస్తారు.
మొదటి నుంచే లాంగ్యేజీ సబ్జెక్టుల బోధన
సాధారణంగా ఐఐటీ కాన్సెప్ట్ కాలేజీల్లో లాంగ్వేజీలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, తాము మాత్రం మొదటి నుంచే లాంగ్వేజీలకి ప్రాధాన్యం ఇస్తామంటున్నారు ఛైర్మన్ సీతారామయ్య. వారంలో మూడు రోజులు సంస్కృతం, మరో మూడు రోజులపాటు ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తామంటున్నారు.
ప్రాక్టీస్ టెస్ట్‌లు(Mock Tests)
జాతీయస్థాయి JEE / NEET ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చూపేందుకు ఛైర్మన్ సీతారామయ్య ప్రత్యేక పాఠ్య ప్రణాళికను తీర్చిదిద్దారు. ప్రతి సోమవారం ఆ వారానికి సంబంధించిన (సబ్జెక్టుల వారీగా) సిలబస్‌ను ప్రకటిస్తారు.
ఈ సిలబస్‌పై వారం రోజులు టీచింగ్ ఉంటుంది. శని, ఆదివారాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపీసీ విద్యార్థులకు JEE MAIN, JEE ADVANCED.. బైపీసీ విద్యార్థులకు NEET తరహా నమూనా పరీక్షలు ఉంటాయి.
ఈ పరీక్షలకు సంబంధించి తిరిగి సోమవారం క్లాసులో లెక్చరర్లు ప్రశ్నల వారీగా వివరిస్తారు. ఎగ్జామ్‌లో రాయని ప్రశ్నలను ఎర్రర్ బుక్‌లో రాయిస్తారు. ఇలా ప్రతి లెక్చరర్ 13 వేలకు పైగా ప్రశ్నలను ప్రాక్టీస్ చేయిస్తారు.
పరీక్షల షెడ్యూల్..
నమూనా పరీక్షల నిర్వహణకు ఐదు వారాల షెడ్యూల్‌ను రూపొందించారు. ఎంపీసీ వారికి మొదటి, రెండు వారాల్లో JEE MAIN, JEE ADVANCED నిర్వహిస్తారు. మూడో వారం ఎంసెట్, JEE MAIN ఉంటాయి. నాలుగో వారం నెల రోజుల సిలబస్‌పై JEE MAIN ఉంటుంది.
ఇక ఐదో వారం.. ఐదు వారాల సిలబస్ పై నమూనా ఐపీ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులకు సైతం ఇదేవిధంగా NEET, EAPCET, IP ఎగ్జామ్స్ ఉంటాయి. ఇలా అన్ని ఎగ్జామ్స్‌ను సమపాళ్లల్లో నిర్వహిస్తూ విద్యార్థుల్లో విషయ నైపుణ్యాలను పెంపొందిస్తారు.
కోర్సు ప్రణాళిక(Course Plan)
- జూన్ 1 నుంచి నవంబరు 30 : 1st Year సిలబస్
- డిసెంబరు 15 వరకు : ప్రీ ఫైనల్ IP పరీక్షలు
- డిసెంబరు 15 – January : ఇంటర్ 2nd year సిలబస్ టీచింగ్
- ఫిబ్రవరి : 1st Pre_Final Exams
- మార్చి : ఫైనల్ ఎగ్జామ్స్
- ఏప్రిల్ – మే : 2nd year సిలబస్ బోధన
- జూన్ – ఆగస్టు 15 : 2nd year సిలబస్ పూర్తి
- ఆగస్టు 15 – 31 : 2nd year IP mock Tests
- సెప్టెంబరు, అక్టోబరు : ఫస్ట్ ఇయర్ సిలబస్ రివిజన్
- నవంబరు, డిసెంబరు : సెకండ్ ఇయర్ సిలబస్ రివిజన్
- జనవరి : JEE Main గ్రాండ్ టెస్టులు
- ఫిబ్రవరి : ప్రయోగ పరీక్షలు
- మార్చి : ఫైనల్ ఎగ్జామ్స్
- ఏప్రిల్ – మే : JEE Advanced, TG EAPCET కోచింగ్
వ్యక్తిగత శ్రద్ధ(Personalized Attention)
విద్యార్థుల వ్యక్తిగత శ్రద్ధ NSR IMPULSE మరో ప్రత్యేకతగా చెబుతున్నారు ఛైర్మన్ సీతారామయ్య. తరగతి వారీగా లిమిటెడ్ స్ట్రెంత్‌ను తీసుకుంటారు. ప్రతి విద్యార్థి ప్రగతిపై శ్రద్ధ చూపుతారు.
విద్యార్థుల పురోగతిపై ఎప్పటికప్పుడు అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ ద్వారా ఛైర్మన్ సీతారామయ్య నేరుగా సమీక్షిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇస్తారు.
పోటీ వాతావరణం(Competitive Environment)
విద్యార్థులను స్ఫూర్తివంతం చేసే పోటీతత్వ వాతావరణం తమ జూనియర్ కాలేజీలో ఉంటుందంటున్నారు. వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, చదువులో మెరుగయ్యేలా ప్రోత్సహిస్తారట.
ప్రొఫెషనల్ గైడెన్స్(Career Counseling)
కేవలం ఇంటర్ విద్య, IIT-JEE / NEET కి సంసిద్ధులను చేయడమే కాకుండా ఇంటర్ తర్వాత.. మిగతా అవకాశాలపై అవగాహన కల్పించడం మరో ప్రత్యేకతనట. కోర్సు పూర్తయ్యాక ఉన్న జాతీయ, అంతర్జాతీయ అవకాశాలపై మార్గదర్శకత్వం చేస్తారని చెబుతున్నారు.