అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPI Payments | దేశంలో యూపీఐ లావాదేవీలు (UPI transactions) విపరీతంగా పెరిగాయి. పెద్ద పెద్ద మాల్స్ నుంచి మొదలు పెడితే తోపుడు బండ్ల వ్యాపారుల వరకు యూపీఐ చెల్లింపులు (UPI payments) స్వీకరిస్తున్నారు.
దీంతో ప్రజలు నగదు వినియోగం తగ్గించి చాలా వరకు లావాదేవీలను యూపీఐ ద్వారానే చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీఐ ఐడీని నచ్చినట్లు మార్చుకునే అవకాశం కల్పిస్తూ పేటీఎం, గూగుల్ పే (Google Pay) ఆప్షన్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఫోన్ నంబర్ ఆధారంగా చాలా వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ ఐడీ అటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఫోన్‌పేలో అయితే మొబైల్ నంబర్ పక్కన @ వైబీఎల్ అని అటోమెటిక్‌గా వస్తుంది.
గూగుల్ పేలో మెయిల్ ఐడీ (email ID) ఆధారంగా యూపీఐ ఐడీ వస్తోంది. అయితే యూపీఐ ద్వారా మోసాలు సైతం పెరగడంతో ఆయా సంస్థలు చర్యలు చేపట్టాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన వ్యక్తిగత వివరాలను బయటపెట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఐడీలను నచ్చినట్లు మెయిల్ ఐడీలా అక్షరాలు, అంకెలతో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాయి.
UPI Payments | అక్టోబర్ 2 నుంచి..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation of India) కొత్త నిబంధనలను అక్టోబర్ 2 నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు యూపీఐ చెల్లింపుల సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ పే, పేటీఎం (Paytm) తమ యూజర్లకు యూపీఐ ఐడీ మార్చుకునే అవకాశం కల్పించాయి. మిగతా సంస్థలు కూడా అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నాయి. దీంతో ఫోన్ నంబర్ చెప్పాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు.
UPI Payments | కొత్త ఐడీని తయారు చేయడం ఇలా..
పేటీఎంలో యూపీఐ ఐడీని మార్చుకోవడం కోసం మొదట యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం ఫ్రొపైల్పై క్లిక్ చేయాలి. యూపీఐ సెట్టింగ్‌లు విభాగంలో కిందకు వెళ్లాలి. అక్కడ లింక్ అయిన యూపీఐ ఐడీలు, ఖాతాలు కనిపిస్తాయి. అక్కడ యూపీఐ ఐడీపై నొక్కి అక్షరాలు, అంకెలను ఉపయోగించి కొత్తదాన్ని సృష్టించవచ్చు. లావాదేవీ వైఫల్యాలను (transaction failures) నివారించడానికి బ్యాకప్ ఐడీలను కూడా సెటప్ చేయవచ్చు.