అక్షరటుడే, వెబ్‌డెస్క్:Russia-Ukraine | రష్యా(Russia), ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) శాంతి ఒప్పందం అంటూనే ఉక్రెయిన్(Ukraine)పై వార్ కొనసాగిస్తూనే ఉన్నాడు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందంకోసం యూఎస్(US) చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు(American president) ట్రంప్‌నకు చిర్రెత్తుకొస్తోంది. పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
పుతిన్ యుద్ధాన్ని ఆపుతామని చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా(Social media) హ్యాండిల్ ‘ట్రూత్’లో కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఇటీవల ఉక్రెయిన్ జనావాసాలపై రష్యా జరిపిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలవల్ల అమాయక ప్రజలు(Innocent people) చనిపోతున్నారన్నారు. అందుకే ఇక పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్ వ్యవహారాన్ని భిన్నంగా డీల్(Deal) చేయాలి. ఇందులో భాగంగా మాస్కో లక్ష్యంగా అదనపు ఆంక్షలు విధించి కట్టడి చేసే మార్గాన్ని చూస్తున్నాం’ అంటూ ట్రంప్ తన ట్రూత్(Truth) ఖాతాలో రాసుకొచ్చారు.