Russia-Ukraine | ఇక రష్యా వంతు!

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Russia-Ukraine | రష్యా(Russia), ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) శాంతి ఒప్పందం అంటూనే ఉక్రెయిన్‌(Ukraine)పై వార్‌ కొనసాగిస్తూనే ఉన్నాడు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందంకోసం యూఎస్‌(US) చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు(American president) ట్రంప్‌నకు చిర్రెత్తుకొస్తోంది. పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. పుతిన్‌ యుద్ధాన్ని ఆపుతామని చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Russia-Ukraine | రష్యా(Russia), ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) శాంతి ఒప్పందం అంటూనే ఉక్రెయిన్‌(Ukraine)పై వార్‌ కొనసాగిస్తూనే ఉన్నాడు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందంకోసం యూఎస్‌(US) చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు(American president) ట్రంప్‌నకు చిర్రెత్తుకొస్తోంది. పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

పుతిన్‌ యుద్ధాన్ని ఆపుతామని చెబుతున్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా(Social media) హ్యాండిల్ ‘ట్రూత్’లో కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఇటీవల ఉక్రెయిన్ జనావాసాలపై రష్యా జరిపిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలవల్ల అమాయక ప్రజలు(Innocent people) చనిపోతున్నారన్నారు. అందుకే ఇక పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘పుతిన్ వ్యవహారాన్ని భిన్నంగా డీల్(Deal) చేయాలి. ఇందులో భాగంగా మాస్కో లక్ష్యంగా అదనపు ఆంక్షలు విధించి కట్టడి చేసే మార్గాన్ని చూస్తున్నాం’ అంటూ ట్రంప్‌ తన ట్రూత్‌(Truth) ఖాతాలో రాసుకొచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...