ePaper
More
    HomeతెలంగాణBJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదలైంది. సోమవారం అధ్యక్ష పదవి కోసం ఆశావహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.

    BJP State President | రేసులో ఉంది వీరే..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చాలా మంది ఆశిస్తుండటంతో అధిష్టానం కొద్ది రోజులుగా ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చింది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్న తెలంగాణ (Telangana)లో మాత్రం ఆలస్యం చేసింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తోంది. ఈ క్రమంలో సత్తా ఉన్న నాయకుడికి పగ్గాలు అప్పగించాలని యోచిస్తోంది. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్​, ధర్మపురి అర్వింద్​, బండి సంజయ్‌ ఉన్నట్లు సమాచారం. మహిళల కోటాలో ఎంపీ డీకే అరుణ సైతం పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈటల రాజేందర్​, ధర్మపురి అర్వింద్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

    BJP State President | హైదరాబాద్​కు కేంద్ర మంత్రి

    రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ నిర్వహించడానికి కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శోభా కరంద్లాజే ఆదివారం (నేడు) హైదరాబాద్‌ (Hyderabad) రానున్నారు. ఆమె ఎన్నికలపై నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు.

    BJP State President | స్థానిక ఎన్నికల నేపథ్యంలో..

    రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. సెప్టెంబర్​ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు(High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే పార్టీకి లాభం జరుగుతుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

    BJP State President | ఏపీ అధ్యక్ష పదవికి..

    ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు సైతం నోటిఫికేషన్‌ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ నోటిఫికేషన్​ విడుదల చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మంగళవారం బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు.

    More like this

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...