అక్షరటుడే, వెబ్డెస్క్ : Job Notification | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 324 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
ఆయా పోస్టుల కోసం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆలయ ఈవోలను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈవోలు పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే అన్ని ఆలయాలకు కలిపి ఒకే నోటిఫికేషన్ కాకుండా.. ఆలయాల వారీగా విడుదల చేయనున్నారు. ఏయే పోస్టులు భర్తీ చేస్తారు.. వాటికి అర్హతలు ఏమిటనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతోంది. మరోవైపు కొత్త నోటిఫికేషన్లు సైతం వెలువడుతుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు.
