అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Collector | నామినేషన్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల (Sarpanch and ward members) స్థానాలకు నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు.
Kamareddy Collector | అధికారులకు పలు సూచనలు..
ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ (election process) నిర్వహించడం జరుగుతుందన్నారు.
నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామ పంచాయతీలోని (Gram Panchayat) వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని సూచించారు. నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఉమాలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.